విషయ అనువాదం

This page is a translated version of the page Content translation and the translation is 94% complete.
Outdated translations are marked like this.

విషయ అనువాదం (కంటెంట్ ట్రాన్స్లేషన్) ఉపకరణం అసలు వ్యాసం పక్కనే అనువాదాలను సృష్టించడానికి అనువాదకులను అనుమతిస్తుంది. ఇంకా వచనాన్ని కాపీ చేయడం, సంబంధిత లింక్‌లు, వర్గాల కోసం వెతకడం మొదలైన ఆసక్తిలేని పనులను సులభతరం లేక అప్రమేయంగా చేస్తుంది. మరింత సరళమైన అనుభవం ద్వారా, అనువాదకులు వారి విలువైన సమయాన్ని మెరుగుగా వాడడం ద్వారా వారి భాషలో సహజంగా చదివే అధిక-నాణ్యత విషయాలను సృష్టించడానికి తోడ్పడుతుంది.

విషయ అనువాద ఉపకరణం, మూలం, అనువదించబడ్డ వ్యాసంలో లింకు సమాచారాన్ని చూడవచ్చు
విషయ అనువాదానికి పరిచయం

ఈ ఉపకరణం, క్రియాశీల అభివృద్ధిలో వున్నది. దీనిని వాడి వేలాది వ్యాసాలు అనువదించబడ్డాయి. అనువాదకుల ఉత్పాదకత లో మెరుగుదలకనబడింది.[1][2] కంటెంట్ ట్రాన్స్ లేషన్ నిఘంటువులు లేక ఇతర యాంత్రిక అనువాద సేవలను తనలో ఇముడ్చుకొని పనిచేస్తుంది. అన్ని భాషలకు తోడ్పాటు వుండకపోవచ్చు, కానీ ఈ ఉపకరణాన్ని ఇతర భాషలకు విస్తరించవచ్చు.

విషయ అనువాదం ప్రస్తుత Translate పొడిగింపుకు పూరకంగా వుంది. వికీపీడియా మెనూలు ,ఇతర వినియోగదారు అంతర్వర్తి(ఇంటర్ ఫేస్)అంశాలకొరకు ప్రస్తుత పొడిగింపును వాడుతారు. వికీపీడియా వ్యాసాలను అనువదించుటకు ఈ ఉపకరణాన్ని వాడవచ్చు.

ఇది కూడ చూడు:

Extension:ContentTranslation

ఈ ఉపకరణాన్ని ప్రయత్నించండి

మీరు ఉపకరణాన్ని లింకు నొక్కి వాడవచ్చు. ఏ వికీపీడియా భాషలోనైనా మొదటిసారి వాడడం వల్ల ఆ వికీ కి ఉపకరణం చేతనం అవుతుంది.

లాగిన్ చేసిన వినియోగదారుల కోసం అన్ని వికీపీడియాలలో ఒక బీటా ఫీచర్ గా విషయ అనువాదం అందుబాటులో ఉంది. ఇది వాడటం మొదలుపెట్టిన తరువాత, మీ "వాడుకరి రచనలు" ఆదేశంపై మోజ్ వుంచినప్పుడు లేదా వికీపీడియా వ్యాసాల భాషల జాబితా నుండి అనువాదాన్ని సులభంగా ప్రారంభించడానికి మీకు వీలుంటుంది. In some languages it must be enabled as a beta feature, and in others it is a usual user preference enabled by default. When it is enabled, you will see additional entry points to easily start a translation from your "contributions" page or from the list of languages of Wikipedia articles when they are missing in your language.

మీకు ఉపకరణంతో ఏదైనా సమస్య ఉంటే లేదా మీరు ఉపకరణంతో మీ అనుభవాన్ని పంచుకోవాలనుకుంటే, దయచేసి చర్చా పేజీలో వ్యాఖ్య చేర్చండి.

విషయ అనువాదాన్ని ఎలా ఉపయోగించాలో చూపించే తెరపట్టు వీడియో (స్క్రీన్‌కాస్ట్)

తాజా వివరాలు

  • విభాగ అనువాదం ప్రాజెక్టు విషయ అనువాద సామర్థ్యాలను పెంచుతుంది. మొబైల్, డెస్క్ టాప్ పై ఒక కొత్త విభాగాన్ని అనువదించడం ద్వారా ఇప్పటికే ఉన్న వ్యాసాలను అనువాదకులు విస్తరించగలుగుతారు. విభాగ అనువాదం చొరవ పెంచటం లో భాగం. దీనిలో మీరు పాల్గొనవచ్చు, పురోగతిని గమనించవచ్చు.
  • విషయ అనువాదానికి వాడుకరి మార్గదర్శకాలు మరల నిర్మించబడింది (ఇంకా పురోగతిలో వుంది). కొత్త సహాయ దస్త్రాలను తనిఖీ చేయండి, వాటిని మెరుగుపరచండి.

ఉపకరణం లక్ష్యం

విషయ అనువాదం (కంటెంట్ ట్రాన్స్లేషన్) ఇతర భాషలో గల వికీపీడియా వ్యాసాన్ని ఆధారంగా చేసుకొని వేరేభాషలో తొలి రూపం సృష్టించడానికి సహాయపడుతుంది. వాడుకరులు తొలి రూపానికి వారికి ఇష్టమైన మూల పాఠ్యం ఎంచుకోవచ్చు, తరువాత వారి సాధారణ సవరణల ఉపకరణాలతో విస్తరించవచ్చు.

విషయ అనువాద ఉపకరణం మానవ జ్ఞానభండారాన్ని చాలా భాషలకు విస్తరించడానికి సహాయపడుతుందని ఆశిస్తాము. రెండు, అంతకంటె ఎక్కువ భాషలు తెలిసిన వాడుకరులకు ఈ ఉపకరణం ఉద్దేశించబడింది.

ప్రస్తుత వికీపీడియా సంపాదకులకు, ఈ ఉపకరణం అనువాద ప్రక్రియను సులభతరం చేస్తుంది. 15% సంపాదకులు రెండు భాషల వికీపీడీయాలలో పనిచేస్తున్నారు. వీరు ఒకే భాషలో కృషి చేసేవారికంటే సగటున 2.3 రెట్లు సవరణలు చేస్తారని కనుగొనబడింది.[3] ఇంకా, పూర్తిగా కొత్త వ్యాసం సృష్టించడం కన్నా సులభంగా కొత్త సంపాదకులు వ్యాసాలు సృష్టించడానికి ఉద్దేశించబడింది.

ఈ ఉపకరణం క్రింద చూపిన సూత్రాల ఆధారంగా అభివృద్ధి చేయబడింది:

  • సమయం ఆదా. బయట ఉపకరణాల వాడి, అనవసరపు నకలు, అతికింపులు చేయనవసరం లేకుండా అనువాదకులు వేగంగా విషయాన్ని సృష్టించడానికి సహాయం.
  • సహాయం అందివ్వు. దోషాలు నివారించి, అనువాదకులకు వారి అనువాదాల నాణ్యతపై నమ్మకాన్ని పెంచడం.
  • నాణ్యమైన అనువాదాలను ప్రోత్సహించడం. వికీపీడియాలో అనువాదాల లక్ష్యాన్ని సరిగా వివరించి తక్కువ నాణ్యతగల అనువాదాలను నివారించడానికి అనువాదకునికి సహాయం.
  • అనువాదకునిపై నిర్భందాలు వద్దు. వివిధ అనువాదకులు వివిధరకాలుగా సవరణ పద్ధతులు వాడవచ్చు కావున, ఈ ఉపకరణం సవరణ పద్ధతులలో కలగుజేసుకోకూడదు.
  • విషయం పై ధ్యాస. అనువాదం పాఠ్య రూపంపై కాకుండా విషయంపై ధ్యాస వుండాలి. వికీటెక్స్ట సాంకేతికాలు అనువాదాన్ని కష్టమవకుండా వుండాలి.

గణాంకాల వివరాలు అందుబాటులో వున్నాయి.

ఎలా పాల్గొనాలి

సంబంధిత పేజీలు

మూలాలు