Help:Growth/Tools/Help panel/te

This page is a translated version of the page Help:Growth/Tools/Help panel and the translation is 96% complete.
The following procedure is only applicable to wikis where the Growth tools are available .
మూసేసినపుడు సహాయ ప్యానెల్ తెరపట్టు
తెరిచినపుడు సహాయ ప్యానెల్ తెరపట్టు

సహాయ ప్యానెల్‌ను వాడుతున్నందుకు, మరింత నేర్చుకోవాలని అనుకుంటున్నందుకూ మీకు ధన్యవాదాలు!

ఈ ఉపకరణం గ్రోత్ బృందపు "సహాయ కేంద్రంపై దృష్టి" ప్రాజెక్టులో భాగం.

2019 లో సహాయ ప్యానెల్, కొన్ని వికీపీడియాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న కొత్త అంశం. ఇది ఏమత్రం ఉపయోగంగా ఉందో తెలుసుకునేందుకు గాను ప్రయోగంలో భాగంగా ఉన్న వాడుకరులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది డెస్క్‌టాప్, మొబైలు బ్రౌజర్లు రెంటికీ అందుబాటులో ఉంది. కానీ, iOS, Android యాప్‌లకు అందుబాటులో లేదు.

సహాయ ప్యానెల్ ఉద్దేశం

ఈ ఉపకరణం లక్ష్యం:

  1. కొత్త వాడుకరులకు సహాయ పేజీలు, ఎలా చెయ్యాలి అనే మార్గదర్శకాలను అందుబాటు లోకి తేవడం.
  2. సహాయ పేజీల్లో తమకు కావలసినది దొరక్కపోతే కొత్త వాడుకరులు, పాతవారిని సందేహాలు అడిగే వీలు కల్పించడం.

దాన్ని ఎలా వాడాలి

మీరు ద్దిద్దుబాటు చేసే ఏ పేజీలోనైనా, తెరకు కుడివైపు కింద ఒక నీలం రంగు బొత్తాం "దిద్దుబాటులో సాయం పొందండి" అనే పేరుతో కనబడుతుంది. ఈ బొత్తాంపై నొక్కితే సహాయ ప్యానెల్ తెరుచుకుంటుంది.

సహాయ ప్యానెల్లో కొన్ని పనికొచ్చే సహాయ పేజీల జాబితా ఉంటుంది. దిద్దుబాటుకు సంబంధించిన చాలా సందేహాలకు ఆ సహాయ పేజీల్లో సమాధానాలు దొరుకుతాయి. ఆ పేజీని మీ బ్రౌజర్లో ఓ కొత్త ట్యాబులో తెరిచేందుకు ఈ లింకుల్లో ఒకదానిపై నొక్కండి.

మీక్కవలసిన సయం దొరక్కపోతే, "మరిన్ని సహాయ పేజీలను చూడండి" పై నొక్కి మొత్తం అన్ని సహాయ పేజీల్లోనూ ఉన్న సమాచారాన్ని చూడవచ్చు.

సహాయ ప్యానెల్‌కు పైన ఉన్న పట్టీలో మీకు కావలసిన దాన్ని టైపిస్తే, అది వెంటనే సంబంధిత సహాయ పేజీల జాబితాను చూపిస్తుంది.

అయినా మీకు కావలసిన సహాయం దొరక్కపోతే, "సముదాయ సహాయ కేంద్రానికి మీ ప్రశ్నను పంపించండి" విభాగాన్ని వాడి అనుభవజ్ఞుడైన వాడుకరిని అడిగి తెలుసుకోవచ్చు.

మీ ప్రశ్నను అడిగినపుడు, మీరు సహాయ కేంద్రం పేజీలో ప్రశ్నను చేర్చి, ఆ పేజీలో దిద్దుబాటు చేస్తున్నట్లే. ఆ పేజీని అనుభవజ్ఞులైన వాడుకరులు సాకుతూ ఉంటారు. కొత్తవారి ప్రశ్నలకు స్వచ్ఛందంగా సమాధానం ఇచ్చేందుకు వారు అందుబాటులో ఉంటారు.

మంచి ప్రశ్న అడిగేందుకు చిట్కాలు:

  • మీరు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో వివరించండి.
  • దాని ఎలా చెయ్యాలని ప్రయత్నించారో ఒక్కో అడుగునే వివరించండి. మిమ్మల్ని అడ్డుకుంటున్నదేంటో వివరించండి.
  • మీరు దిద్దుబాటు చేస్తున్నది డెస్కుటాప్‌ పైనా, మొబైల్లోనా అనేది చెప్పండి. అది ఎలాంటి మొబైలో కూడా వివరించండి.
  • మీరు దిద్దుబాటు చేస్తున్నది విజువల్ ఎడిటరు (గ్రాఫికల్ ఎడిటింగ్ మోడ్) లోనా లేక వికీటెక్స్టు (టెక్స్ట్ ఎడిటింగ్ మోడ్) లోనా అనేది మీకు తెల్సితే అది కూడా చెప్పండి.
  • మీ ప్రశ్న ఏదైనా మూలం గురించి అయితే, ఆ మూలపు లింకు కూడా ఇవ్వండి.

మీ ప్రశ్నకు సమాధానాన్ని ఎక్కడ దొరుకుతుంది

  • మీరు మీ ఖాతాకు ఈమెయిలు అడ్రసును చేర్చి, దాన్ని ధ్రువీకరించి ఉంటే, మీ ప్రశ్నకు ఎవరైనా సమాధానం ఇచ్చినపుడు మీకు ఈమెయిలు వస్తుంది. ఈమెయిలు చేర్చాలన్నా, ధ్రువీకరించాలన్నా, మీ అభిరుచులకు వెళ్ళండి.
  • మీ బ్రౌజరులో పైన ఒక గమనింపు లాగా కూడా వస్తుంది:
డెస్క్‌టాపుపై మొబైలుపై
   

మీకు సమాధానం వచ్చాక, సహాయ కేంద్రం పేజీలో ఆ సమాధానం కింద మీ తదుపరి సందేశాన్ని పంపిస్తూ ఆ సంభాషణను కొనసాగించవచ్చు.

ఎలా పాల్గొనవచ్చు

మీరు ఉపకరణాన్ని వాడుతోంటే

ఈ ఉపకరణం గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు స్పందన పేజీలో చెప్పవచ్చు. మీకిష్టమైన భాషలో రాయండి.

దీన్ని మెరుగుపరచే సూచనలేమైనా ఉన్నా, ప్రాజెక్టులకు సంబంధించి ప్రశ్నలేమైనా ఉన్నా, సహాయ ప్యానెల్‌ను వాడడంలో ఇబ్బందులేమైనా ఉన్నా వాటన్నిటినీ ఆహ్వానిస్తున్నాం.

మీరు కొత్తవారికి సాయపడదలచుకుంటే

మీ వికీలోని సహాయ కేంద్రంలో సమాధానాలిస్తున్న ఇతర వాడుకరులతో సమన్వయం చేసుకోండి. సహాయ కేంద్రంలో సమాధానాలు ఎలా ఇవ్వాలనే విషయమై కొన్ని మంచి పద్ధతుల గురించి చదవండి.

తరచూ అడిగే ప్రశ్నలు

See also: the global FAQ about Growth features

నా ప్రశ్న ఎక్కడుంది?

మీ ప్రశ్నను సహాయ కేంద్రం పేజీలో ప్రచురించాం. దాన్ని చూసేందుకు ఒక తేలికైన పద్ధతి ఏంటంటే, డెస్క్‌టాపులో నైతే మీ బ్రౌజరులో పైన కుడి వైపున, మొబైల్లో నైతే ఎడమ వైపున ఉన్న మెనూలోనూ ఉన్న "నా మార్పులు" ను నొక్కండి.

నా ప్రశ్నకు ఎవరూ సమాధానమివ్వలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి?

ఓపిక వహించండి! :) ప్రశ్నలకు సమాధానాలిచ్చేది స్వచ్ఛంద సేవకులే. వాళ్లు ఆన్‌లైనులో లేరేమో.

కింది విషయాలకు సంబంధించి దృఢపరచుకునేందుకు మీరు పంపిన సందేశాన్ని మళ్ళీ పరిశీలించుకోండి:

  • మీరు ఏం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారో వివరించండి.
  • మీరు ఎలా చేసారో ఒక్కో అడుగునూ వివరించండి. మీకు అడ్డుపడినది ఏంటో వివరించండి.

అలాగే, కొన్ని ప్రశ్నలు బాగా క్లిష్టమైన విషయాలకు సంబంధించి అయి ఉండవచ్చు. అనుభవజ్ఞులైనవారు కూడా వాటిని ఎన్నడూ ఎదుర్కొనలేదేమో. మీకు సమాధానమిచ్చేందుకు వాళ్లకు కొంత సమయం పట్టవచ్చు.

సహాయ ప్యానెల్‌ను అచేతనం చెయ్యడం ఎలా?

కింది పద్ధతుల్లో ఎలాగైనా ప్యానెల్‌ను అచేతనం చెయ్యవచ్చు:

  • 'సహాయ ప్యానెల్‌ను అచేతనం చెయ్యి' బొత్తాన్ని నొక్కడం ద్వారా.
  • మీ అభిరుచులు పేజీకి వెళ్ళి, అక్కడ దిద్దుబాట్లు ట్యాబులో 'Enable the editor help panel' ను నొక్కడం ద్వారా.

సహాయ ప్యానెల్‌ను చేతనం చెయ్యడం ఎలా?

సహాయ ప్యానెల్ మీ వికీలో అందుబాటులో ఉంటే, మీ అభిరుచులు పేజీకి వెళ్ళి, దిద్దుబాట్లు ట్యాబులో ప్యానెల్‌ను చేతనం చెయ్యవచ్చు.

సహాయం అంశాలకు లింకులను ఎలా ఎంచుకున్నారు?

సముదాయం చర్చించి ఆ లింకులను ఎంచుకుంది. ప్రయోగం జరుగుతున్న క్రమంలో, కొత్త వాడుకరులు అడిగే ప్రశ్నల ప్రకారం, ఏ లింకులు బాగా అవసరమో చూసి తదనుగుణంగా ఆ లింకులను మార్చుకోవచ్చు.

సహాయ ప్యానెల్, సంబంధిత ప్రాజెక్టులు అవసరం ఏమిటో తెలుసుకోవడం ఎలా?

ప్రాజెక్టుకు సంబంధించిన సవివరమైన పేజీని చదివి, స్పందన పేజీలో దాని గురించి మమ్మల్ని అడగవచ్చు.