గ్రోత్/సముదాయాలు/మిమ్మల్ని మీరు గురువుగా పరిచయం చేసుకోవడం ఎలా

This page is a translated version of the page Growth/Communities/How to introduce yourself as a mentor and the translation is 87% complete.
Outdated translations are marked like this.
Other languages:
Bahasa Indonesia • ‎English • ‎Tiếng Việt • ‎Türkçe • ‎dansk • ‎euskara • ‎français • ‎italiano • ‎latviešu • ‎magyar • ‎polski • ‎português • ‎português do Brasil • ‎română • ‎svenska • ‎čeština • ‎русский • ‎српски / srpski • ‎українська • ‎հայերեն • ‎עברית • ‎العربية • ‎বাংলা • ‎తెలుగు • ‎日本語 • ‎한국어

మీకు గురువుగా ఉండాలని ఆసక్తిగా ఉందా? ధన్యవాదాలు!

కొత్తవాడుకరులతో వ్యవహరించడం ఎలా అనే విషయమై సమాచారాన్ని చూసి, ఆ తరువాత మిమ్మల్ని మీరు గురువుగా పరిచయం చేసుకోండి.

హోంపేజీలో చూపించడం

 
హోంపేజీలో మీ పరిచయం ఎలా చూపిస్తామో ఇక్కడ చూడవచ్చు.
 
240 కారెక్టర్ల కంటే ఎక్కువ ఉన్న పరిచయ సందేశాలను కత్తిరిస్తాం.

కొత్తవాడుకరి హోంపేజీ ని, కొత్తవారు వికీపీడియాలో తొలి అడుగులు వేసే సమయంలో సాయంగా ఉండేలా తయారు చేసాం. హోంపేజీ మీ పేరును ఎవరైనా కొత్త వాడుకరికి యాదృచ్ఛికంగా జత కలుపుతుంది: ఆపై మీరే వారికి గురువు.

హోంపేజీలో ఆ కొత్తవడుకరులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే స్థలం ఒకటుంది. డిఫాల్టుగా ఆ పరిచయం "మీరు కొత్తవారని ఈ అనుభవజ్ఞులైన వాడుకరికి తెలుసు. వారు మీకు దిద్దుబాటు చెయ్యడంలో సాయపడతారు.".

మీ పరిచయాన్ని 240 క్యారెక్టరలకు మించనీయకండి. హోంపేజిలో ఈసరికే కనబడే సమాచారంతో కలిసి మరీ పెద్దదై పోకుండా ఉండేందుకు ఈ పరిమితి పెట్టాం. ఈ కారణం వల్లనే వికీటెక్స్టును రెండరు చెయ్యడం లేదు. మీ గురించి మరింతగా తెలుసుకునేందుకు కొత్త వాడుకరులు, హోంపేజీ నుండీ లింకున్న మీ వాడుకరి పేజీకి వెళ్ళి చూడవచ్చు.

హోంపేఝీలో మీ వాడుకరిపేరు ఈ సరికే కనబడుతూంటుంది. మీ పరిచయస్థులైన కొత్త వాడుకరులకు ఆ సంగతి గుర్తు చెయ్యనవసరం లేదు.

ఉదాహరణలు

(అనువాదాల కారణంగా, కింది ఉదాహరణలు 240 క్యారెక్టర్ల పరిమితిని మించి ఉండవచ్చు.)

మిమ్మల్ని మీరు చాలా తటస్థతతో పరిచయం చేసుకోవచ్చు:

 • "వికీపీడియా గురించి తెలుసుకోవడంలో మీకు సాయం చేసేందుకు వచ్చాను, వెనకాడకుండా మీ సందేహాలు అడగండి!"

ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగే అనుభవం మీకుంది. ఏవో ఫలానా విషయాలపైన మాత్రమే సాయం చెయ్యగలరనే అభిప్రాయం వారికి కలిగించకండి.

 • "నేను ఆటల గురించిన వ్యాసాల్లో దిద్దుబాట్లు చేస్తూంటాను" అని రాయకండి. మిమ్మల్ని ఆటలకు మించి మరేమీ అడగకూడదని కొత్త వాడుకరులు అనుకునే అవకాశం ఉంది.
 • ఇలా రాయవచ్చు: "నేను ఎక్కువగా ఆటలకు సంబంధించిన వ్యాసాల్లో రాస్తూంటాను. కానీ ఏ విషయంలోనైనా నా శక్తిమేరకు మీకు సాయం చెయ్యగలను."

కొత్త వాడుకరులు మిమ్మల్ని సంప్రదించవచ్చని అహ్వానించండి:

 • "వికీపీడియాలో దిద్దుబాట్లు చేసే విషయమై నేను మీకు సాయపడగలను. నేను ఎక్కువగా క్రీడలకు సంబంధించిన్ విషయాలపై రాస్తూంటాను. మీరు ఎలాంటి విషయాలపై రాయాలని అనుకుంటున్నారు?"
 • "ఇప్పుడు మీకున్నట్లే ఒకప్పుడు నాక్కూడా గందరగోళంగా ఉండేది. అనుభవజ్ఞులను అడిగి విషయాలను తెలుసుకున్నాను. మీరు కూడా, ఏ సందేహం వచ్చినా వెనకాడకుండా నన్ను అడిగెయ్యండి"

గురువుల జాబితాలో మీ పేరు చేర్చుకోవడం ఎలా

The following procedure is only applicable to wikis where the Growth tools are available:
 • Arabic Wikipedia
 • Bulgarian Wikipedia
 • Bengali Wikipedia
 • Catalan Wikipedia
 • Czech Wikipedia
 • Spanish Wikipedia
 • Greek Wikipedia
 • English Wikipedia
 • Basque Wikipedia
 • Persian Wikipedia
 • French Wikipedia
 • French Wiktionary
 • Hebrew Wikipedia
 • Hindi Wikipedia
 • Croatian Wikipedia
 • Hungarian Wikipedia
 • Armenian Wikipedia
 • Japanese Wikipedia
 • Korean Wikipedia
 • Latvian Wikipedia
 • Malay Wikipedia
 • Norwegian Bokmål Wikipedia
 • Polish Wikipedia
 • Portuguese Wikipedia
 • Romanian Wikipedia
 • Russian Wikipedia
 • Albanian Wikipedia
 • Simple English Wikipedia
 • Slovak Wikipedia
 • Serbian Wikipedia
 • Swedish Wikipedia
 • Tamil Wikipedia
 • Telugu Wikipedia
 • Thai Wikipedia
 • Turkish Wikipedia
 • Ukrainian Wikipedia
 • Vietnamese Wikipedia
 • test.wikipedia.org

మీ వికీ లోని గురువుల జాబితా వికీడేటాలో ఉంది.

కింది సింటాక్సులో మీ వాడుకరిపేరును (దాని దారిమార్పును కాదు) ఆ జాబితాలో చేర్చండి:

* [[వాడుకరి:వాడుకరిపేరు]]|వివరణ

ఉదాహరణ: * [[వాడుకరి:Trizek]]|నేను అనేక విషయాల్లో పనిచేస్తూంటాను. మీకు సంతోషంగా సాయం చేస్తాను!

వివరణలో వికీటెక్స్టు (లింకులు, మూసలూ వద్దు), HTML, CSS లను చేర్చకండి: అది చెడిపోతుంది.

ఐచ్ఛికాలు

శిష్యులను స్వీకరించడం

కొన్నిసార్లు గురువులు తప్పుకుంటారు; వారి స్థానంలో వేరొకరిని చేర్చాల్సి రావచ్చు. లేదా ఓ గురువు కొత్త వాడుకరిని, సంబంధిత విషయంలో నైపుణ్యం గల వేరే గురువు వద్దకు పంపించవచ్చు. అలాంటి సందర్భాల్లో గురువులు శిష్యులను స్వీకరిస్తారు. It is then possible for mentors to claim a mentee.

వర్కుషాపు నిర్వాహకుల కోసం వేరే జాబితా

డిఫాల్టుగా, గురువుల జాబితా ఒకటే ఉంటుంది. ఈ జాబితాలో ఉన్న గురువులు కొత్త వాడుకరులకు ర్యాండమ్‌గా కేటాయించబడతారు. వర్కుషాపులు నిర్వహించే అనుభవజ్ఞులు తమకు తెలిసిన వారినే శిష్యులుగా స్వీకరించే వీలు కల్పించాలని కొన్ని వికీలు కోరాయి. Some wikis asked to have a way for experienced users who host workshops to only claim mentees they know.

తెలియని వారికి కాకుండా, తెలిసిన వాఅరికి మాత్రమే కేటాయించబడేలా వేరే గురువుల జాబితాను సృష్టించి, అనుభవజ్ఞులు అందులో చేరే వీలు కల్పించే సంభావ్యత ఉంది.

ఈ జాబితాను సృష్టించేందుకు, మమూలు గురువుల జాబితా సింటాక్సు తోనే ఒక పేజీని సృష్టించి, దాన్ని సంబంధిత వికీడేటా అంశానికి లింకు చెయ్యండి. ఆ తరువాత ఫ్యాబ్రికేటరులో [$form ఈ ఫారాన్ని] వాడి, కాన్పిగరేషను మార్పు అభ్యర్ధన పెట్టండి.